మహేష్‌ స్టైల్లో గౌతమ్‌..

512
mahesh gowtham
mahesh gowtham
- Advertisement -

వినాయక నవరాత్రుల మూడోరోజున హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిమజ్జనాల సందడి ప్రారంభమైంది. బుధవారం ఉదయం నుంచే ఇళ్లలో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలు, కార్యాలయాల్లో పూజలు నిర్వహించిన చిన్న విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఎంతో మంది నెక్లెస్‌రోడ్‌కు వచ్చారు. ఇక మహేష్ తనయుడు గౌతమ్ తమ ఇంట్లో ప్రతిష్టించుకున్న వినాయకుడిని దుర్గం చెరువులో నిమజ్జనం చేశాడు. ఈ సందర్భంలో తలకు రిబ్బన్ కట్టుకొని కొత్తగా కనిపించాడు గౌతమ్. నలుగురు యువకులతో కలిసి గౌతమ్ వినాయక నిమజ్జనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ కూడా తలకు రిబ్బన్ కట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఇపుడు గౌతమ్‌ కూడా అదే స్టైల్లో కనిపిస్తుడడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Gautham-Krishn

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ తెరకెక్కిస్తోన్న మూవీ కోసం చెన్నై వెళ్ళగా, ఈ స్మాల్ సూపర్ స్టార్ బుజ్జి వినాయకుడితో సందడి చేశాడు. మరో వైపు గౌతమ్ అల్లూరి సీతారామరాజు బాల్యంకి సంబంధించి తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

gautham

- Advertisement -