పాచిపోయిన ప్యాకేజీ లడ్డూ..

535
- Advertisement -

కాకినాడ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ,బీజేపీలపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భారత్ మాతాకీ జై అంటూ పవన్ ప్రసంగం ప్రారంభించిన పవన్‌ తనదైన శైలిలో ఉద్వేగంగా ప్రసంగించారు. టీడీపీ,బీజేఏపీ నేతల వైఖరిని తూర్పార బట్టారు. మాననీయ వెంకయ్యనాయుడూ జీ… ఆప్ ఔర్ ఆప్ కీ బీజేపీ పార్టీ నే మిలికే దోనో హాతోంమే లడ్డూ… మోతీ చూర్ కా లడ్డూ దియా” (వెంకయ్యనాయుడు గారూ… మీరూ, మీ బీజేపీ పార్టీ కలసి మా రెండు చేతుల్లో బూందీ లడ్డూ పెట్టారు) అంటూ మండిపడ్డారు. మూడేళ్ల నుంచి స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇస్తాం అంటూ తీపికబురు వస్తుందని ఆశగా చూస్తుంటే రెండు లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటారా? లడ్డూ తింటారా? అంటున్నారు” అంటూ పవన్ వ్యంగ్యంగా అన్నారు.కాంగ్రెస్ అవకాశ వాద రాజకీయాలు చేసి వెన్నులో పొడిస్తే….బీజేపీని నమ్మితే పొట్టలో పొడిచారని ఎద్దేవా చేశారు.

బీజేపీ నేతలకు ఎంత ధైర్యం….సీమాంధ్రుల్లో పౌరుషం చనిపోయిందనుకుంటున్నారా ప్రశ్నించారు. సీమాంధ్రకు వచ్చి సీమాంధ్రను విడదీస్తారా అని ప్రశ్నించారు. మీ చాత గాని తనం వల్ల ప్రజలను విడగొట్టి…న్యాయం చేయకుండా విద్వేశాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేయడమే కాదు….ఆయన రాజ్యాంగ స్పూర్తిని బయటకు తీసుకురావాలని సూచించారు.

pawan

తెలంగాణకు అన్యాయం జరిగిందని పవన్ అన్నారు.విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. తెలంగాణకు హైకోర్టు…ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేసింది సీమాంధ్రులు మాత్రమే అనుకోవడం తప్పని….తెలంగాణ నేతలు కూడా అన్యాయం చేశారని అన్నారు. మర్రిచెన్నారెడ్డి, జానారెడ్డి తెలంగాణకు అన్యాయం జరిగినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ అంటే తనకు ప్రేమని…ప్రజల కష్టాలు తెలుసన్నారు.

కళ్లు మూసుకుంటే నిద్ర కాదని ద్యానం అని ఎందుకు అనుకోకూడదని పరోక్షంగా తనను విమర్శించే వారిపై సెటైర్లు వేశారు. గోటితో పోయే దాన్ని గొడ్డలిదాక తీసుకొచ్చారని మండిపడ్డారు. కొందరు తనను ఉద్దేశించి, రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత సులభం కాదని అంటున్నారని గుర్తు చేసిన పవన్.. గడ్డం గీసుకోవడానికి పట్టేంత సమయంలోనే రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టలేదా? అంటూ ప్రశ్నించాడు.ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్…మీహక్కుల కోసం వచ్చా…మీ సహకారం కావాలని పవన్ పిలుపునిచ్చారు. మనకు మనమే సైన్యం….జన సైన్యమన్నారు.

చాలామంది నేతల్లా వేల కోట్ల రూపాయల్ని సంపాదించలేదు…వేలాది ఎకరాలు సంపాదించలేదని మండిపడ్డారు. సినిమాలను వదిలేయంటే…ఈ క్షణమే వదిలేస్తా అని అభిమానులకు ప్రశ్నను సంధించారు. దిగువ మద్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టే సామాన్యుల కష్టం తెలుసన్నారు. ప్రజాసమస్యలే నా గాడ్ ఫాదర్‌ అని పవన్ నినదించారు. నన్ను నడిపించే శక్తి ప్రజలే అన్నారు. చాలామంది నేతల్లా వేల ఎకరాలు…వందల కోట్లు సంపాదించలేదన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం, వారి నాయకులపై గౌరవం ఉందని, అది తగ్గలేదని చెప్పిన పవన్, తనకు వ్యక్తిగతంగా ఏపార్టీతోనూ విభేదాలు లేవని, ప్రజా సమస్యల విషయానికి వస్తే మాత్రం తాను విభేదిస్తానని స్పష్టం చేశాడు. ఇప్పుడు టీడీపీ సర్కారు ఆ పాచిపోయిన రెండు లడ్డూలను తీసుకుంటుందా? తీసుకోదా? అన్నదే మన ముందున్న ప్రశ్నని అన్నాడు.

- Advertisement -