నాయకులొస్తే.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే

420
former test captains
former test captains
- Advertisement -

టెస్టుల్లో టీమిండియా అరుదైన మైలురాయికి చేరుకోనుంది. సంప్రదాయ క్రికెట్‌లో 500వ టెస్టుకు భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 22న కాన్పూర్‌లో మొదలయ్యే తొలి టెస్టు భారత్‌కు 500వ మ్యాచ్‌. దీంతో, ఈ చారిత్రక సందర్భాన్ని వేడుకలా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది. ఈ టెస్టుకు బీసీసీఐ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్‌ను పురస్కరించుకుని జరిపే సంబరాలకు భారత మాజీ కెప్టెన్లందరినీ ఆహ్వానించాలని బోర్డు నిర్ణయించింది.

ఈ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా మాజీ కెప్టెన్లందరినీ సన్మానించాలని బీసీసీఐ నిర్ణయించిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తెలిపారు. మాజీ కెప్టెన్లందరినీ గ్రీన్‌పార్క్‌లో సన్మానిస్తే గొప్పగా ఉంటుందని.. ఇందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోందని శుక్లా వెల్లడించారు. అనినారీ కాంట్రాక్టర్‌, చందు బోర్డే, వెంగ్‌సర్కార్‌, కపిల్‌ దేవ్‌, రవిశాస్త్రి, గావస్కర్‌, గంగూలీ, సచిన్‌, శ్రీకాంత్‌, కుంబ్లే, ద్రవిడ్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.

icc

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న అజహరుద్దీన్‌ను మాత్రం ఈ వేడుకలకు పిలవడం లేదని తేలిపోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కోర్టు అజహర్‌ను నిర్దోషి అని ప్రకటించినా బోర్డు మాత్రం ఇంకా వివక్ష చూపుతుండటం విమర్శలకు దారితీస్తున్నది. గతంలో చాలా మంది తమకు వ్యతిరేకంగా ప్రవర్తించినా తర్వాతి కాలంలో క్షమించి అక్కున చేర్చుకున్న బోర్డు ఈ హైదరాబాద్ ఆటగాడి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని చూపుతున్నది.

కాగా చరిత్రలో నిలిచిపోయే ఈ టెస్ట్ మ్యాచ్‌ కోసం ఉపయోగించే టాస్ కోసం ప్రత్యేకంగా ఓ వెండి నాణెంను రూపొందించింది. ఆ వెండి నాణంపై ‘500వ టెస్టు’ అని ముద్రించనుంది. ‘యూపీసీఏతో కలిసి బీసీసీఐ.. భారత కెప్టెన్లకు విందు ఏర్పాటు చేస్తుంది. న్యూజిలాండ్‌, భారత జట్లు కూడా ఇందులో పాల్గొంటాయ’ని శుక్లా తెలిపారు. ఇక, బోర్డు, యూపీసీఏ ‘500వ టెస్ట్‌’ ముద్రించిన టి-షర్టులను మ్యాచ్‌కు హాజరయ్యే పేద చిన్నారులకు పంచనుంది.

ఈ మైలురాయిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ..  మామూలుగా ఇలాంటి వేడుకలకు ఐసీసీ ప్రతినిధిగా ఎవరినైనా గతంలో ఆహ్వానించేది. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శశాంక్ మనోహర్ ఇటీవల ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత బీసీసీఐ నిర్ణయాలను ఆయన అడ్డుకుంటున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధికారాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఐసీసీ చీఫ్, ఐసీసీ సీఈవోలకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీసీసీఐ ఎలాంటి ఆహ్వానం పంపకపోవడం విశేషం.

Image result for ganguly sachin dravid

- Advertisement -