దొరసాని శివాత్మికతో ఆనంద్ దేవరకొండ రొమాన్స్

748
dorasani firstlook
- Advertisement -

పెళ్లిచూపులు,అర్జున్ రెడ్డి సినిమాలతో టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ రెండు మూవీలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. దీంతో విజయ్ కెరీర్ మలుపు తిరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్‌ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

యధార్థ సంఘటనల ఆధారంగా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు ఆనంద్. సినిమా షూటింగ్ కూడా పూర్తికావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు విజయ్.

దొరసాని అనే టైటిల్‌ని ఈ మూవీకి కన్ఫామ్ చేయగా రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. బిగ్ బెన్ మూవీస్,మధుర ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కింది.

ఫస్ట్ లుక్‌ పోస్టర్ చూస్తుంటే ఇది వింటేజ్ మూవీలా అనిపిస్తోంది. ఈ సినిమాకు మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో షార్ట్ ఫిల్మ్స్ యాడ్స్ చేసిన మహేంద్ర అచ్చమైన తెలంగాణ భాషా సంస్కృతుల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తుండగా సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.

- Advertisement -