తగ్గేదే లేదంటున్న పూజా హెగ్డే..

201
Pooja-Hegde-
- Advertisement -

‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాల్లో నటించిన పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో అప్పుడు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ చిత్రాల తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ఈ అమ్మడు  ‘డీజే’ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్‌కు జోడీగా ‘డీజే’ చిత్రంలో తర్వాత ఈమెకు బారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసేందుకు సిద్దం అయ్యింది.

Pooja-Hegde-

ఇవి కాకుండా మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబోలో దిల్ రాజు – అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో కూడా తననే హీరొయిన్ గా ఎంచుకున్నారు. ఇది తనకు ఖచ్చితంగా మేజర్ బ్రేక్ అవుతుంది అని నమ్ముతోంది పూజా. భరత్ అనే నేను షూటింగ్ పూర్తి కాగానే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. తనకి మేజర్ అసెట్ అయిన బాడీ విషయంలో పూజా హెడ్గే చాలా కేర్ తీసుకుంటోంది అని చెప్పడానికి ఈ అమ్మడుకు సంబంధించి ఇటీవలి ఫోటోలను చూస్తే మనకు అర్ధమవుతుంది. పూర్తిస్థాయిలో ఈ ముద్దుగుమ్మ తన ఫిట్‌ నెస్‌ పై శ్రద్ధ పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా పూజా కేరీర్‌ గాడిలో పడాలని, ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని మనమూ కోరుకుందాం.

Pooja-Hegde-

- Advertisement -