టీఆర్ఎస్‌కే ఎంఆర్‌పీఎస్ మద్దతు

919
tmrps
- Advertisement -

తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(టీఎంఆర్‌పీఎస్‌) మద్దతు టీఆర్ఎస్‌కేనని స్పష్టం చేశారుఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సూర్యపేటలో మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి తమ మద్దతును ప్రకటించారు.

ఎస్సీలకు అండగా నిలబడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని శ్రీనివాస్ తెలిపారు. ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడమే కాకుండా ప్రధాని మంత్రి వద్దకు కూడా తీసుకెళ్లి పార్లమెంట్ లో బిల్లు ను పాస్ చేయుంచేందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషిని ఎవరూ మరచిపోలేదన్నారు.

రాబోయే ఎన్నికల్లో 16 కు 16 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ద్వారా ఎస్సీ వర్గీకరణ సాధ్యమన్నారు. బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతాబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కత్తుల తులసి దాస్, దైదా రవి,మేడి నర్సింహ, జొన్న పాల రమేష్, నరేందర్,సైదులు, కృష్ణ బాబు, రమేష్, తదితర టి.ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -