జర్నలిస్టులకు అండగా ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్‌

332
tfja
- Advertisement -

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఎం చేయాలో తెలియ‌ని అయెమ‌య ప‌రిస్థితిలో అంద‌రూ వుండిపోయారు. ఒక ప‌క్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్జించాల్సిన విష‌యం. అయితే 24 / 7 ఏరోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా వుంటుంద‌ని త‌మ భ‌రోసా తెలియ‌జేశారు.

ప్రెసిడెంట్ ల‌క్ష్మినారాయ‌ణ గారు మాట్లాడుతూ..” ఫీల్డ్ లో అంటే డైలీ ప్రెస్‌మీట్స్ కి హ‌జ‌రయ్యే ప్ర‌తి ఓక్క జ‌ర్న‌లిస్ట్ ల‌కి , వీడియో జ‌ర్న‌లిస్ట్ ల‌కి, ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి ఆసరాగా వుంటాము. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి నెల‌రోజుల‌కి స‌రిప‌డా నిత్యావ‌స‌రాల స‌రుకుల తో అండ‌గా నిలిచాము. ఇలానే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కొరుకుంటున్నాము. ఏ ఒక్క‌రూ ఆక‌లి తొ వుండ‌కూడ‌ద‌నేది మ‌న అసోషియెష‌న్ ముఖ్య వుద్దేశ్యం. మీకు ఏ ఇబ్బంది క‌లిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్ గారికి గాని, రాంబాబు(tv5) గారికి కాని ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చు.. మీ అంద‌రికి చివ‌రిగా నా ప్ర‌త్యేఖ‌మైన విన్న‌పం ఇది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి.. దీన్ని అంద‌రూ అర్దం చేసుకొవాలి, ఏ ఓక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అందరం అండ‌గా వుండి పోరాడాలి.. అన్ని స‌మ‌స్య‌లు పోయి మ‌ళ్ళి అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకొవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్ ద్వారా కొరుకుంటున్నాను. మంచి కార్య‌క్ర‌మాల‌కి వెన్నుదండుగా వున్న‌ మీ అంద‌రికి నా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు.” అని అన్నారు

- Advertisement -