చైతూ ‘మజిలీ’లో వెంకీ,నాగ్..!

643
nagachaitanya majili
- Advertisement -

పెళ్లి త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టిస్తున్న చిత్రం మ‌జిలీ. షైన్ స్కీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతోంది. ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఈనెల 31న మజిలీ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ నగర్‌ జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోస్ విక్టరీ వెంకటేష్‌, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వెంకీ, నాగ్‌ ఒకే స్టేజ్‌పై కనిపించనుండటంతో దగ్గుబాటి,అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే కానుంది.

ఇదే వేడుకలో వీరిద్దరూ కలిసి చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్‌గా నటించింది. రావు రమేష్, సుబ్బరాజ్, పోసాని క్రిష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు.

ఇక వెంకటేష్-నాగచైతన్య కలిసి మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ చేస్తున్న సంగతి తెలిసిందే. నిజజీవితంతో చైతూకి వెంకటేష్ మామ కాగా అదే టైటిల్‌తో సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

- Advertisement -