చుక్కలు చూపిస్తోన్న కాజల్..!

699
Kajal Aggarwal
Kajal Aggarwal
- Advertisement -

చందమామ లాంటి కళ్ళతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న బ్యూటీ కాజల్. ముద్దుగా ఈ భామని మిత్రవింద అని కూడా పిలుచుకుంటారు. ఒకప్పుడు మంచి ఫాంలో ఉన్న కాజల్ ఈ మధ్య వరుస ఫ్లాపులతో చతికిల పడింది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ కూడా ఈ అమ్మడికి ఒక్క విజయాన్ని అందించలేకపోయింది. దీంతో అందరు కాజల్ పని అయిపోయింది అనుకున్నారు. కాని ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా వరుస ఆఫర్లని దక్కించుకొని గాసిప్ రాయుళ్ళకి సరైన సమాధానం ఇచ్చింది కాజల్. తమిళంలో అజిత్, జీవా లాంటి స్టార్ హీరోల సరసన ఛాన్స్లు కొట్టేసిన కాజల్ తెలుగులోను భారీ ఆఫర్లే దక్కించుకుంది.

Kajal Aggarwal

మామూలుగా ఓ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోందంటే.. ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే అనుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మాంచి డిమాండింగ్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లు సైతం ఐటెం పాటలకు స్టెప్పులేస్తున్నారు. శ్రుతి హాసన్.. తమన్నా.. ఐటెం సాంగ్స్తో మంచి పేరు సంపాదించగా.. తాజాగా ‘జనతా గ్యారేజ్’లో పక్కా లోకల్ పాటతో ఓ ఊపు ఊపేసింది చందమామ. ఇప్పటిదాకా స్టార్ హీరోయిన్లు చేసిన ఐటెం సాంగ్స్ అన్నిటికంటే దీనికి ఎక్కువ పేరు వచ్చిందనడంలో సందేహం లేదు.

Kajal Aggarwal

‘జనతా గ్యారేజ్’లో ఎన్టీయార్, మోహన్లాల్ నటనతోపాటు అందరూ మాట్లాడుకుంటున్నది కాజల్ ఐటెంసాంగ్ గురించే. అసలు హీరోయిన్లను తలదన్నే రీతీలో ఈ ఒక్క పాటతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కాజల్. ఈ పాటకోసం కాజల్ రూ.50 లక్షలు తీసుకుందని వార్తలు కూడా వచ్చాయి. అయినా ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ను చూస్తుంటే అంత డబ్బు చెల్లించడం తప్పేం కాదనుకుంటున్నారట నిర్మాతలు. మొత్తానికి తీసుకున్న పారితోషకానికి పూర్తి న్యాయమే చేసింది కాజల్.

 

దీని తర్వాత కాజల్ కు మరిన్ని ఐటెం పాటల ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఐతే ఆమె ఇంకా ఏదీ ఫైనలైజ్ చేయలేదు. మాంచి పారితోషకంతో ఐటెం సాంగ్స్ ఆఫర్ చేస్తుండటంతో ఆమె టెంప్ట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఐతే వచ్చిన ఆఫర్లన్నీ ఓకే చెప్పకుండా ఒకటి రెండు పాటలకు కాజల్ ఓకే చెప్పొచ్చు. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా.. ఐటెం సాంగ్స్ తో ఇంకో రెండు మూడేళ్లు నెట్టుకొచ్చేయొచ్చు కాజల్. అంతలా ఉంది ఆమె డిమాండ్.

- Advertisement -