గెలుపు కోసం జగన్‌ రాజశ్యామల యాగం..!

1381
jagan sharada peetam
- Advertisement -

నాడు మోడీ నేడు జగన్ కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి,సంక్షేమం నిరంతరాయంగా కొనసాగాలని కేసీఆర్ ఆయుత,సహస్ర చండీయాగాలను నిర్వహించారు. కేసీఆర్ బాటలోనే ఢిల్లీలో శతరుద్ర సహిత రాజశ్యామల మహారుద్రయాగాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించగా తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్‌ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం యాగాన్ని నిర్వహించారు.

ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో విజయం కోసం జగన్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించినట్లు సమాచారం. మార్చి 27న ప్రారంభమైన ఈ యాగం.. మార్చి 29న ముగిసింది. నెల్లూరు జిల్లాలో ఈ యాగాన్ని నిర్వహించారు. అయితే జగన్ యాగం జరిపిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. యాగం జరిగిన వార్తను బెంగళూరు మిర్రర్ ఆన్‌లైన్ ఎడిషన్లో ప్రచురించింది. జగన్ కుటుంబానికి చెందిన ఓ ఎంపీ మాత్రమే ఈ యాగంలో పాల్గొన్నారట.వివేకానంద రెడ్డి హత్య కారణంగా.. దశదిన కర్మలు ముగిశాక యాగాన్ని నిర్వహించారు.

విశాఖపట్నం శారాదాపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పర్యవేక్షణలో యాగం పూర్ణాహుతిని నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ యాగంలో మొత్తం 27 మంది రిత్వికులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు,గత ఏడాది నవంబర్లో కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో శారదాపీటం ఆధ్వర్యంలోనే రాజ్య శామల యాగాన్నినిర్వహించారు.

ఉత్తర భారతంలో రాజశ్యామలయాగం విరివిగా నిర్వహిస్తుంటారు. ఇక దక్షిణభారతదేశంలో కేసీఆర్ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామితో ఈ యాగాన్ని నిర్వహించి వార్తల్లో నిలిచారు. అనంతరం ఎన్నికలలో అనూహ్య ఫలితాలు సాధించి రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ బాటలోనే యాగాన్ని నిర్వహించారు జగన్‌.

- Advertisement -