గణేష్ నిమజ్జనానికి ఘనమైన ఏర్పాట్లు

220
- Advertisement -

గురువారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా నిమజ్జన ఏర్పాట్లలో టెక్నాలజీని వినియోగించనున్నారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

ఇవాళ అర్థరాత్రి వరకు ఖైరతాబాద్ మహా గణనాథున్ని దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మహా గణనాథుడిని తొలుత నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో రేపు ఉదయమే శోభాయాత్ర ప్రారంభం కానుంది.15వ తేదీన అనంత చతుర్ధశి తిథిలోకి ప్రవేశించగానే ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కర్రలు, ఇతర సెట్టింగ్ లు అన్ని తొలగిస్తారు. విగ్రహాన్ని వాహనం మీదకు చేర్చే ఏర్పాట్లు చేస్తారు. గురువారం ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైపోతుంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయనున్నారు.

khairatabad ganesh

నగరంలో రేపు జరగబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని తెలిపారు. సిటిలో మూడు వందల ప్రాంతాలను అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు.

ప్రతి రూట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిమజ్జనం చేయడం మంచిదని సూచించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 51 క్రేన్లు ఏర్పాటు చేశామని ప్రకటించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

- Advertisement -