క్రికెటర్లు కష్టపడడం మానేశారు

230
Easy money is spoiling cricketers: Glenn McGrath
Easy money is spoiling cricketers: Glenn McGrath
- Advertisement -

ట్వి20 వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలర్లు కష్టపడడం మానేశారని ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చండీగఢ్ లో పీఏసీ స్టేడియంలోని కోచింగ్ క్లినిక్ లో అండర్-23 పేసర్లకు మెక్ గ్రాత్ మెళకువలు నేర్పించాడు. ఈ సంధర్బంగా మెక్ గ్రాత్ మాట్లాడారు. క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోందని, డబ్బు మోజులో పడి వర్ధమాన క్రికెటర్లు ఆటను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నాడు. ట్వి20లో సక్సెస్ కాగానే శ్రమించడం ఆపేస్తున్నారని అభిప్రాయపడ్డాడు.

క్రికెట్ రాణించాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలని అన్నాడు. సక్సెస్ కావడానికి కష్టపడడం ఒకటే మార్గమని, షార్ట్ కట్స్ లేవని చెప్పాడు. క్రికెటర్లకు ఆటే ముఖ్యమని, తర్వాతే డబ్బు సంపాదన గురించి ఆలోచించాలన్నారు. యువ క్రికెట్లు చాలా కష్టపడాలని, ఓ పేరు వచ్చాక దానిని కాపాడుకునేందుకు మరింత కష్టపడాల్సిన అవసరముందని పేర్కొన్నాడు.

ఫాస్ట్ బౌలర్లను టి20లు వెలుగులోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయని.. ఇది కేవలం ఒక్క భారత్‌కే పరిమితం కాలేదని, ప్రపంచమంతా ఇది విస్తరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్, ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ వంటి వాటి ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్న క్రికెటర్లు ఇప్పటికే చాలా చేశామన్న తృప్తితోనే శిక్షణ ఆపేస్తున్నారని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.

పింక్ బంతితో డేనైట్ టెస్టు మ్యాచ్ లు నిర్వహించడం వల్ల క్రికెట్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని, దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలని యువక్రికెటర్లకు ఉద్బోధించాడు.

- Advertisement -