ఐపీఎల్ రైట్స్…ఓపెన్ టెండర్లు

199
- Advertisement -

ఐపీల్ పదో సీజన్‌ నుంచి 2017-28 కాలానికి ప్రసార హక్కుల కోసం బీసీసీఐ ఓపెన్ టెండర్లకు ఆహ్వానించింది. నేటి నుంచి నెల రోజుల వరకు ఈ టెండర్లకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఐపీఎల్‌ తొలి సీజన్‌ నుంచి మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియాతో బంధానికి తెరపడనుంది. ఐపీఎల్‌ ప్రసార హక్కుల ఒప్పందాన్ని రెన్యువల్‌ చేసుకోవడానికి సోనీకి హక్కు ఉన్నప్పటికీ.. ఇప్పుడు బీసీసీఐ మనసు మార్చుకుంది.

లోథా కమిటీ సిఫార్సుల మేరకు ఓపెన్ టెండర్లను పిలవాలని నిర్ణయించినట్లు బీసీసీఐ చీఫ్ అనుగార్ ఠాకూర్ తెలిపారు.ఓపెన్ టెండర్ల ద్వారా పారదర్శకతకు పెద్దపీఠ వేస్తామని వెల్లడించారు. ఐపీఎల్‌ ఆరంభ సమయంలో పదేళ్ల కాలానికి ప్రసార హక్కుల్ని 1.63 బిలియన్‌ డాలర్లకు సోనీ సొంతం చేసుకుంది.

ipl

టెలివిజన్‌ ప్రసార హక్కులతో పాటు డిజిటల్‌ హక్కుల్ని వేర్వేరు కాలాలకు, వేర్వేరు ప్రాంతాలకు టెండర్ల ద్వారా అప్పగించనున్నారు.టీవీ హక్కుల్ని ఓ సంస్థ, డిజిటల్‌ హక్కుల్ని మరో సంస్థ సొంతం చేసుకుంటే.. టీవీ ప్రసారం కంటే ఐదు నిమిషాలు ఆలస్యం డిజిటల్‌ ప్రసారం ఉండేలా చూసుకోవాలి. రెండు హక్కుల్నీ ఒకే సంస్థ తీసుకుంటే డిజిటల్‌ ప్రసారాల విషయంలో షరతులేమీ ఉండవు. పదేళ్ల కాలానికి భారత ఉపఖండ ప్రాంతంలో టీవీ హక్కులు, ఐదేళ్ల పాటు ఇదే ప్రాంతంలో డిజిటల్‌ హక్కులు, ఐదేళ్ల పాటు ఉపఖండేతర ప్రాంతాలకు మీడియా హక్కుల కోసం టెండర్లు ఆహ్వానించారు. వేటికవే ప్రత్యేక టెండర్లు వేయొచ్చు. లేదా అన్నింటికీ కలిపి ఒకే సంస్థ టెండర్లు దాఖలు చేయొచ్చు.

- Advertisement -