మేకింగ్ ఆఫ్ నాని…జెర్సీ

198
nani jersy

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జెర్సీ. నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తుండగా ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి అధ్బుతమైన స్పందన వచ్చింది.

తాజాగా నాని జెర్సీ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రయూనిట్. 70 రోజుల పాటు నెట్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేశారు. నిపుణుల సమక్షంలో ఏ బంతిని ఎలా ఆడాలో తర్ఫీదు తీసుకున్నాడనే మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది.

90 దశకంలో జరిగిన ఓ క్రికెటర్ జీవిత కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారు. 36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా అతడు నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. విజయాలతో పాటు వైఫల్యాలు వెనుక నిలబడ్డాయి. 1996-97లో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్‌పై అతడికి ఉన్న ప్రేమ బయట పెట్టింది అంటూ ఆ క్రికెటర్ ఎవరన్నదానిపై సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు నాని. మరి ఏప్రిల్‌లో ముందుకురానున్న ఈ చిత్రంతో నాని ఆకట్టకుంటాడా లేదా చూద్దాం.