ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా..!

230
puja hegde

ఒక లైలా సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కున మెరిసిన అందాల భామ పూజా హెగ్డే. తర్వాత వరుణ్ తేజ్‌తో ముకుంద,అల్లు అర్జున్‌తో డీజే సినిమాలో నటించి మెప్పించింది పూజా. రామ్‌ చరణ్ రంగస్థలం సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన పూజా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సేమతలో కీ రోల్ పోషించింది. ప్రస్తుతం మహేష్- వంశీపైడిపల్లి చిత్రంతో పాటు జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్- ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోను ఈ హాట్ బ్యూటీనే కథానాయికగా కనిపించనుంది.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దువ్వాడ జగన్నాథం సినిమాకు ముందు ఈ బ్యూటీ సినీ కెరీర్‌లో రెండేళ్లు బ్రేక్ వచ్చింది. ఈ గ్యాప్‌లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. మొహంజోదారో దెబ్బకు బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది.

రెండేళ్లు ఒక నటికి చాలా ఇంపార్టెంట్. అప్పుడు నాకు ఆ విషయం అర్థం కాలేదు. మొహంజదారో సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉంటున్నాను అని తెలిపింది.