ఆనంద్, శివాత్మిక అదరగొట్టారు..’దొరసాని’ టీజర్‌

176
Dorasaani Movie Teaser

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’. ఈ సినిమాలో నటుడు డాక్టర్ రాజశేఖర్ కుమార్తె శివాత్మిక తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘దొరసాని’ టీజర్ తాజాగా విడుదలై, వైరల్ అవుతోంది. ఈ చిత్రం దొరల గడీల నేపథ్యంలో సాగుతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

ఇక కథను పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం హీరో హీరొయిన్లను మాత్రమే టీజర్‌లో చూపించారు. హీరో ఆనంద్ దేవరకొండ లేతగా పల్లెటూరి కుర్రాడిగా ఒదిగిపోయాడు. మొదటి సినిమాలోనే మంచి నటన కనబర్చినట్లు కనిపిస్తోంది. అలాగే హీరోయిన్‌ శివాత్మిక చూడటానికి దొరసానిని తలపించింది. ఒద్దికగా ఓరకంటితో రాజుని ప్రేమలో పడేసే పాత్రలో మెప్పించేలా కనిపిస్తోంది.

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్న దొరసానికి సన్నీ కొర్రపాటి ఛాయాగ్రహణం మరో ఆకర్షణ. కెవిఅర్ మహేంద్ర దర్శకత్వం సహజత్వానికి అద్దం పట్టింది. సురేష్ బాబు-యష్ రంగినేని-మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.