నిర్భయంగా ఓటేయండి:వైఎస్ జగన్‌

364
jagan trs
- Advertisement -

ఏపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రతిపక్ష నేత,వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్‌ జనం మార్పు కోరుకుంటున్నారని ..నిర్భయంగా ఓటు వేయాలని కొత్త ఓటర్లకు పిలుపునిచ్చారు.దేవుడి ఆశీస్సులు తమపై ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.

టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి జమ్మలమడుగులో ఓటేశారు. ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన గుంతకల్‌ జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు. సినీ హీరో అల్లు అర్జున్ బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మహారాష్ట్రలోని నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు జనం తరలిరావాలని భగవత్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా, ఆ పోలింగ్‌ కేంద్రంలోనే ఈవీఎంలు పనిచేయలేదు.

ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్న నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

- Advertisement -