‘ఎంతవారలైనా’ పెద్ద హిట్‌ అవుతుందిఃనిర్మాత జి. సీతారెడ్డి

26
yenthavaralina

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎంతవారలైనా’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియో వన్‌ మిలియన్‌ రియల్‌టైమ్‌ వ్యూస్‌ని దాటి అన్ని వర్గాల శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రం ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ రావడంతో సినిమాకి మంచి పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, జి.సీతారెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. సమ్మర్‌ కానుకగా మే 17న అత్యంత గ్రాండ్ గా ఈచిత్రం విడుదలవుతుంది.

దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ – ”ఈ సినిమా స్టోరి సీతారెడ్డిగారికి చెప్పినప్పుడే దీనికి సంబంధించిన అన్ని లొకేషన్లు ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాను. ముఖ్యంగా సాంగ్స్‌ని మైసూర్‌, చిక్‌మంగుళూరువంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. ఇటీవల విడుదలైన మా చిత్రం ఆడియోకి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. ఇక సాంగ్స్‌ని స్క్రీన్‌ మీద చూస్తున్నప్పుడు అంతకంటే ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యేలా బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. అలాగే సినిమాటోగ్రాఫర్‌ మురళీమోహన్‌ రెడ్డి మాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ఆయన అందించిన ఫొటోగ్రఫీ సినిమాకి మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది.

నిర్మాత, నటుడు జి.సీతారెడ్డి మాట్లాడుతూ – ”ఈ ఫంక్షన్‌ హీరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుక్కు. ఇతను లేకపోతే ఈ సినిమా ఫిఫ్టీ పర్సెంట్‌ లేదు. నేను ఇదివరకు చెప్పినట్లు ఈ సినిమాకు కథే హీరో. దానికి తగ్గట్లు అద్భుతమైన సాంగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌నిచ్చి సుక్కు మరో హీరోగా నిలిచారు. ఒక చిన్న సినిమాలా కాకుండా పెద్ద సినిమాలా చాలా బాగా చేశారు. రాఘవేంద్రరావుగారి సినిమాల్లో మ్యూజికల్‌ హిట్స్‌ చాలా ఉన్నాయి. అలా ఈ సినిమా మ్యూజిక్‌ వినగానే ఆడియో ఆయన సినిమాలా ఉంటుందని, విజువల్‌గా కూడా బాగుండాలని మంచి లొకేషన్స్‌లో సాంగ్స్‌ షూట్‌ చేశాం. మే 17న విడుదలవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మళ్లీ కలుద్దాం” అన్నారు.