రివ్యూ:యాత్ర

336
Yatra movie review
- Advertisement -

దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర టైటిల్‌తో మహి వి రాఘవ్ తెరకెక్కించారు. సినిమా ట్రైలర్‌,పాటలతో అంచనాలను పెంచేయగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తొలిసారిగా తెలుగు చేస్తున్న తొలిమూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను సినిమా అందుకుందా లేదా చూద్దాం…

కథ :

ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి(మమ్ముట్టి) చేసిన పాద‌యాత్ర నేపథ్యంలో సాగే చిత్రమిది. పాదయాత్ర ప్రయాణంలో వైఎస్‌ ప్రజల కష్టాలను వినడం వాళ్లకి తానున్నానని భరోసా ఎలా ఇచ్చారు అన్న భావోద్వేగాల నేపథ్యంలో సాగింది. ప్రజా సమస్యలను వైఎస్‌ ఏ విధంగా పరిష్కరించారు..? ప్రజల గుండెల్లో మహానేతగా ఎలా ఎదిగారు ? ఈ క్రమంలో వైఎస్సార్ ఎదురుకున్న ఇబ్బందులు, అనుభవాలు ఏమిటి ? అన్నది తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.

Related image

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ భావోద్వేగా సన్నివేశాలు,మ‌మ్ముట్టి ,వైఎస్ పాదయాత్ర సన్నివేశాలు. తొలిసారి తెలుగులో స్ట్రైయిట్ సినిమాచేసిన మలయాళ సూపర్ స్టార్‌ మమ్ముట్టి వైఎస్ పాత్రలో ఒదిగిపోయారు. అచ్చు వైఎస్‌ని అనుకరించిన ఆయన తన డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో మమ్ముట్టి నటన సినిమాకే హైలైట్. రావు రమేష్‌,ఆశ్రిత,జగపతిబాబు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.పాటలు సూపర్బ్.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌, క‌థ పాద‌యాత్ర‌కే ప‌రిమితం కావ‌డం. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. మంచి ఎమోషనల్ గా సినిమాని నడిపిన మహి, అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. సూర్య‌న్ కెమెరా ప‌నిత‌నం, ‘కె’ సంగీతం బాగుంది. ప‌ల్లెల్లో క‌ళ ఉంది పాట చిత్రీక‌ర‌ణ విధానం బాగుంది. పాదయాత్ర నేపథ్యంలోనే కథని అల్లిన దర్శకుడు మహి వి. రాఘవ్‌ మాటల రచన, డ్రామాని జోడించి భావోద్వేగాలు పండించిన విధానం మెప్పిస్తుంది.ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for yathra review

తీర్పు :

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌లో ట్రెండ్ నడస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ పాదయాత్ర నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. రైతుల కన్నీళ్లను తుడవడానికి క‌డ‌ప దాటి పాదయాత్ర పేరుతో ప్ర‌తి గ‌డ‌ప‌లోకి వెళ్లారు.అలాంటి పాదయాత్ర థీమ్ బేస్ చేసుకొని మహి.వి.రాఘవ్ చేసిన ప్రయత్నమే యాత్ర. మమ్ముట్టి నటన సినిమాకు హైలైట్ కాగా సెకండాఫ్ మైనస్‌. ఓవరాల్‌గా వైఎస్సార్ అభిమానులకు గుర్తుండిపోయే చిత్రం యాత్ర.

విడుదల తేదీ :08/02/2019
రేటింగ్:2.75/5
నటీనటులు : మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని
సంగీతం : కృష్ణ కుమార్
నిర్మాత : విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి
దర్శకత్వం : మహి.వి.రాఘవ్

- Advertisement -