భారత్ చేరుకున్న అభినందన్‌..

295
abhinandan
- Advertisement -

జమ్మూలోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాక్‌ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో పాక్‌ భూభాగంలో కూలిన ఐఏఎఫ్‌కి చెందిన మిగ్‌21 పైలట్‌ అభినందన్‌ మూడు రోజుల పాక్‌ చెరనుండి సురక్షితంగా భయటపడ్డారు. మధ్యాహ్నం వాఘా చెక్‌పోస్టుకు చేరుకున్న అభినందన్‌కు వైమానిక దళ అధికారులు ఘనస్వాగతం పలికారు. అభినందన్‌ సురక్షితంగా భారత్‌ చేరుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. శత్రువు చెరలో చిక్కినా స్థైర్యం కోల్పోలేదని అభినందన్‌ ధైర్యాన్ని యావత్‌ భారతావని కొనియాడుతోంది.

భారత్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ దేశానికే గర్వకారణమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను వెంటనే బేషరతుగా స్వదేశానికి తిప్పి పంపాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ నిన్న ప్రకటించారు.

మా దేశ వీరుడు తిరిగి వస్తున్నాడు.. యుద్ధంలోనూ, పాకిస్తాన్ చేతుల్లో బందీగా మారిన సమయంలోనూ వీరోచిత సాహసం ప్రదర్శించారు..ఆయన ధైర్య సాహసాలకు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.

- Advertisement -