వరంగల్‌ పార్లమెంట్…కహానీ

324
warangal mp
- Advertisement -

వరంగల్ ప్రాంతం కాకతీయుల కోటగా ప్రసిద్ధిచెందిన చారిత్రాత్మక ప్రదేశం. మొదట ఓరుగల్లుగా పిలువబడ్డ ఈ ప్రాంతం క్రమేపి వరంగల్ గా పిలవబడుతోంది. 12వ శతాబ్దంలో ఈఒరుగల్లు కోట నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఓరుగల్లు కోటకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. ఈ కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఆధికారిక చిహ్నంగా ఉన్నాయి.

వరంగల్ పార్లమెంట్ స్ధానానికి ఎంతో మంది నాయకులు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి వరకూ జరిగిన 16పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8సార్లు గెలవగా, టీడీపీ 4సార్లు, టీఆర్ఎస్ 3సార్లు గెలిచింది. ఇక వరంగల్ జిల్లా మొదటి ఉద్యమ ఖిల్లాగా చెప్పుకుంటారు. ఏ ఉద్యమం చేపట్టిన వరంగల్ వాసులు ముందంజలో ఉంటారనడంతో సందేహం లేదు. ఎంతో మంది
కళాకారులు, కవులు, ఉద్యమకారులు ఈవరంగల్ పార్లమెంట్ స్ధానంలో పుట్టిన వారే. ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో కొన్ని ప్రసిద్ది చెందిన ప్రాంతాలున్నాయి. ప్రముఖ దేవాలయాలైన వేయి స్తంభాల గుడి, శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయం, రామప్ప దేవాలయం, ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయాలు ప్రసిద్ది గాంచినవి. అలాగే పలు పర్యాటక ప్రదేశాలకు కూడా ఈ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రసిద్దిగాంచింది. పాకాల సరస్సు, వన విజ్నాన కేంద్రం, లక్నవరం లాంటి పర్యాటక ప్రదేశాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.

తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన చాకలి అయిలమ్మ, ప్రముఖ కవి బమ్మెర పోతన, దాశరధి పలువురు ప్రముఖ కవులు కూడా వరంగల్ పార్లమెంట్ పరిధిలో జన్మించిన వారే. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, దాశరథి కృష్ణమాచార్య, సర్వాయి పాపన్న పలువురు
వరంగల్ పార్లమెంట్ ప్రాంతంలో జన్మించినవారే. వరంగల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ స్ధానాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.

వరంగల్ నగరంలో కాకతీయులు నిర్మించిన కాకతీయ యూనివర్సిటీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కాజీపేట్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. వరంగల్ పార్లమెంట్ లోని రైతులకు ఉపయోగపడేవిధంగా అత్యాధునికి హంగులతో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కూడా ప్రసిద్ది ఫేమస్ గా చెప్పుకోవచ్చు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, శనగ , పొగాకు,మిర్చి వంటి పంటలను పండించడంతో పాటు కూరగాయల సాగు కూడా పెద్ద మొత్తంలో చేస్తారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 15లక్షల37వేల 781మంది ఓటర్లు ఉన్నారు.

ఇక వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 16 మంది ఎంపీలుగా పనిచేశారు. 1952 సంవత్సరంలో మొట్టమొదటి సారి ఈ నియోజకవర్గం లో జరిగిన ఎన్నికల్లో పిడిఎఫ్ పార్టీ అభ్యర్ధి పెండ్యాల రాఘవరావు విజయం సాధించారు. పెండ్యాల రాఘవరావు 1952 నుంచి 1957వరకూ ఎంపీ గా పనిచేశారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సదాత్ అలీ ఖాన్ గెలుపొందారు. సదాత్ అలీ ఖాన్ 1957 నుంచి 1962 వరకు ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బకార్ అలీ మిర్జా గెలుపొందారు. బకార్ అలీ మిర్జా 1962నుంచి 67 వరకూ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సురేందర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1971 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ అభ్యర్ధి ఎస్.బి గిరి గెలుపొందారు. వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా ఎస్.బి గిరి 1971నుంచి 1977సంవత్సరం వరకూ పనిచేశారు.

ఆతర్వాత 1977సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జి. మల్లిఖార్జున్ రావు గెలుపొందారు. మల్లిఖార్జున రావు 1977నుంచి 1980వరకూ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కామలుద్దిన్ అహ్మద్ గెలుపొందారు. కామలుద్దిన్ అహ్మద్ 1980 నుంచి 1984 వరకూఎంపీగా సేవలందించారు. ఆతర్వాత 1984లో జరిగిన
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి డాక్టర్ టీ. కల్పన దేవి గెలుపొందారు. కల్పన దేవి 1984 నుంచి 1989 వరకూ ఎంపీ పనిచేశారు. ఆ తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రామ సహాయం సురేందర్ రెడ్డి గెలుపొందారు. మళ్లీ 1991లో జరిగిన ఎన్నికల్లో రామ సహాయం సురేందర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. పదేళ్లు వరంగల్ ఎంపీగా రామ సహాయం
సురేందర్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత 1996 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి అజ్మీరా చందూలాల్ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి అజ్మీరా చందూలాల్ మరోసారి గెలిచారు. 1999వరకూ చందూలాల్ వరంగల్ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బోడకుంటి వెంకటేశ్వర్లు గెలుపొందారు.

1999 నుంచి 2004వరకూ వరంగల్ ఎంపీగా పనిచేశారు బోడకుంటి వెంకటేశ్వర్లు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి ధరావత్ రవీంద్రనాయక్ గెలుపొందారు. రవీంద్రనాయక్ 2004నుంచి 2008 వరకూ ఎంపిగా పనిచేశారు. ఆ తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపొందారు. ఆ తర్వాత 2009లో
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య గెలుపొందారు. 2009 నుంచి 2014వరకూ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీగా పనిచేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర్రం వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కడియం శ్రీహరి గెలుపొందారు. ఆ తర్వాత కడియం శ్రీహారి రాజనామా చేసిన అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్
అభ్యర్ధి పసునూరి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణపై విజయం సాధించారు.

ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ స్ధానం ఎస్సీ రిజర్వ్ డ్ గా ఉంది. వరంగల్ పార్లమెంట్ స్ధానం నుంచి ప్రస్తుత ఎంపీ గా కొనసాగుతున్న పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పసునూరి దయాకర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యర్దిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్దులు లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక వరంగల్ పార్లమెంట్ లోని 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్ధానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా కేవలం ఒక్క స్ధానం మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అందుకోసమే మరోసారి వరంగల్ ఎంపీ స్ధానాన్ని టీఆర్ఎస్ గెలవనుందనే విషయం గట్టిగా చెప్పుకోవచ్చు.

- Advertisement -