టచ్ చేసి చూడు…ట్రైలర్

245
Touch Chesi Chudu Theatrical Trailer
- Advertisement -

మాస్ రాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత ‘టచ్ చేసి చూడు’ అంటూ మాసివ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాశి ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

లవ్,ఎమోషన్‌,యాక్షన్‌ అన్నికలగలిపి ట్రైలర్‌ను ముందుకుతీసుకొచ్చారు. పెళ్లి ఎప్పుడు అంటే..క్యాన్సిల్ అయింది అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌ అందరిని ఆకట్టుకుంది. నా మనుషుల్ని కొట్టి మిషనరీని ఎత్తుకెళ్లారు..కరెక్ట్‌గా డ్యూటీ చేస్తే రెండే రెండు నిమిషాల్లో కేసును పరిష్కరించవచ్చు. యూనిఫాంలో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు..యూనిఫాం తీసేస్తే రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు అంటూ రవితేజ తనదైన స్టైల్లో చెప్పే డైలాగ్ అదిరిపోయింది.చివరగా నేను వస్తున్నా అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది… ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..

- Advertisement -