ఐరోపా దేశాలపై సైబర్ దాడి

224
The New attack on IT again …
- Advertisement -

యూరప్‌ పై సైబర్ దాడి జరిగింది. ఇటీవల వివిధ దేశాలను కుదిపేసిన ‘వాన్నాక్రై’ దాడి గురించి మరిచిపోకముందే యూరప్‌లో మరో భారీ సైబర్‌ దాడి వెలుగు చూసింది. బ్రిటన్, ఉక్రెయిన్, స్పెయిన్‌ దేశాల్లో ని ఇండస్ట్రీలపై ఈ సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు డౌన్‌ అయ్యాయి. బ్యాంకులు, విద్యుత్‌ రంగ సంస్థలు ప్రభావితమయ్యాయి. ఇది అసాధారణ సైబర్‌ దాడిగా ఉక్రెయిన్‌ ప్రధాని తెలిపారు.

నౌకాయాన సంస్థలు, కంటైనర్‌ టెర్మినళ్లు, న్యాయ సేవలందించే సంస్థలు, చమురు-సహజవాయు సంస్థలు, ఆహార సరఫరా కంపెనీలు తమ కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు మాల్‌వేర్‌ బారిన పడ్డాయని వెల్లడించాయి. పరిస్థితిని అంచనా వేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.

The New attack on IT again ...

స్పెయిన్‌ టెలికాం సంస్థలు, జర్మనీ రైల్వే, యూకేలోని వైద్య సంస్థలు ఈ దాడి బారిన పడ్డాయి. ‘మీ ఫైళ్లు మీకు ఇకపై అందుబాటులో ఉండవు. వాటిని నిగూఢపరిచాం. 300 డాలర్లను బిట్‌కాయిన్‌ డిజిటల్‌ కరెన్సీ రూపంలో చెల్లించండి’ అని డిమాండ్‌ చేస్తూ కంప్యూటర్లపై కనిపించిన సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విండోస్‌ను వాడుతున్న కంప్యూటర్లను ఆపుచేసి, వాటికి విద్యుత్తు సరఫరానూ తొలగించాల్సిందిగా కంపెనీలు తమ ఉద్యోగులకు సూచించాయి. ఒక వైరస్‌ను తొలగించడానికి ఉపయోగపడేది ప్రోగ్రామ్‌గా భ్రమింపజేసి ఈ దాడికి పాల్పడినట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తాజా దాడిలో 150 దేశాల్లో 2.30 లక్షలకు పైగా కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి. మనుషులతో ప్రమేయం లేకుండా దానంతట అదే వ్యాపించేలా దీనిని తీర్చిదిద్దారని భావిస్తున్నారు.

- Advertisement -