రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్..

462
ts formaton day
- Advertisement -

జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌ను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు .అయితే ఎప్పటిలా ఉత్సవాలను పరేడ్ గ్రౌండ్స్‌లో కాకుండా.. పబ్లిక్ గ్రౌండ్‌లోని జూబిలీ హాల్‌కు ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించాలని సూచించారు.

మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం 9 గంటల నుంచి 10.30 మధ్య ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేడుకలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. 10.30లకు సీఎస్‌ ఆధ్వర్యంలో ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. 11 గంటలకు రాష్ట్రావతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం పురస్కార ప్రదానోత్సవం ఉండనుంది.

షెడ్యూల్‌..

()ఉదయం అమరవీరుల స్థూపానికి కేసీఆర్‌ నివాళులు
()9 గంటల నుంచి పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందన కార్యక్రమం
()ఉదయం 10.30లకు సీఎస్‌ ఆధ్వర్యంలో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం
()11 గంటలకు జూబ్లీ హాలులో కవి సమ్మేళనం

- Advertisement -