కేసీఆర్‌తో కనిమొళి భేటీ..

464
- Advertisement -

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. నిజమైన సమాఖ్య వ్యవస్థ ఏర్పాటే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ దిశగా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో రెండు మూడు నెలల్లో కీలక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భారతదేశం లౌకికరాజ్యంగానే మనుగడ సాగించాలి తప్ప మరో మార్గం, ప్రత్యామ్నాయం లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. ఫెడరల్ ఫ్రంట్‌కు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు సోమవారం కూడా చెన్నైలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది.

Telangana CM KCR meets Kanimozhi

ఈ సందర్భంగా ఐటీసీ చోళ హోటల్‌లో కేసీఆర్‌తో డీఎంకే ఎంపీ కనిమొళి భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, చెన్నై పర్యటన ఉద్దేశాలపై చర్చించనున్నారు. ఆదివారం చెన్నై వచ్చిన కేసీఆర్‌కు తమిళ ప్రజలు బ్రహ్మరథం ప‌ట్టిన విష‌యం తెలిసిందే. తొలుత గోపాలపురంరోడ్డులోని కరుణానిధి ఇంటికి వెళ్లారు. అనంతరం అల్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఆయన కుమారుడు, తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌తో సమావేశ‌మైన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

- Advertisement -