ఆర్‌ఆర్‌ఆర్‌..తారక్ చెప్పిన అప్‌డేట్ ఇదే

335
ntr ram charan
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌,ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్ర ఆర్‌ఆర్ఆర్(వర్కింగ్ టైటిల్). తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ఇచ్చారు తారక్‌. వడోదరలో జరిగే భారీ షెడ్యూల్ కోసం తాము బయలుదేరుతున్నట్లు ట్వీట్ చేశారు. తారక్ చేసిన ట్వీట్‌లో రామ్‌ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి.

తారక్ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే 20వేలకు పైగా లైకులు రాగా హ్యాపీ జర్నీ అన్నా అంటూ కొంతమంది ట్వీట్ చేస్తుంటూ మరికొంతమంది సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇవ్వు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

1920లో ఉత్తరభారతదేశంలో జరిగే కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య దాదాపుగా రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీంగా కనిపించనున్నారు. చెర్రీ సరసన అలియాభట్, ఎన్టీఆర్ సరసన డైసీ అడ్గార్‌జోన్స్‌ నటించనున్నారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్,అజయ్ దేవగన్‌ సైతం ఈ మూవీలో నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2020 జూలై 30న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -