దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి రండి:తలసాని

370
talasani uttam kumar
- Advertisement -

దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని కాంగ్రెస్‌ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికహక్కు ఉత్తమ్‌కు లేదని మండిపడ్డ తలసాని ఇవే ఈవీఎంలతో ఉత్తమ్‌ గెలవలేదా అని ప్రశ్నించారు. 17 ఎంపీ స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌ కనీసం తమకు పోటీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. తమ పాలన బాగుంటేనే ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు.

మతాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని, ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని ఆరోపించారు. అభినందన్‌ను వదలకపోతే పాక్‌కు కాలరాత్రేనని మోడీ మాట్లాడారని, భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై ప్రధాని బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. దేశం గర్వపడేలా రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. ఇంటర్‌ ఫలితాలపై ప్రభుత్వం కమిటీ వేసిందని, కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టంచేశారు.

- Advertisement -