వైభవంగా శ్రీసీతారాముల కల్యాణం..

244
Sri Rama Navami
- Advertisement -

భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వేదమంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా జరుగుతోంది. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లఘ్నమందు సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాన్ని నిర్వహించారు. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు.

ప్రభుత్వం తరుపున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమర్పించారు. శోభాయమానంగా మిథిల ప్రాంగణం ముస్తాబైంది. భక్తుల కోసం అధికారులు 3 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. 34 ప్రత్యేక కౌంటర్లలో రాముల వారి తలంబ్రాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సీతాదేవికి యోత్రబంధనం, శ్రీరాముడికి యజ్ఞోపవీతధారణను అర్చకులు చేశారు.

- Advertisement -