స్పైడర్ టీజర్ ఎప్పుడో తెలుసా…

221
Spyder teaser on August 9th
- Advertisement -

మహేష్‌బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘స్పైడర్‌’. మహేష్‌ సరసన రకుల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. మహేష్‌, రకుల్‌పై వచ్చే ఆ పాటని ఆగస్టు 1 నుంచి యూరప్‌లోని రొమేనియాలో శోభి నృత్య దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు.

Spyder teaser on August 9th ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దసరా పండుగని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.  మహేష్‌- మురుగదాస్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి దీటుగా సినిమాని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తమిళ హక్కుల్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సొంతం చేసుకుంది’’ అన్నారు.

ఇక  ఈ సినిమా టీజర్‌ని ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. రెండు నెలల కిందట విడుదలైన ‘స్పైడర్’ టీజర్ గ్లింప్స్  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘స్పైడర్’ తమిళ వెర్షన్ హక్కుల్ని 2.0 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రూ.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు రెండు రోజుల కిందటే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ సినిమాకు రూ.170-200 కోట్ల మధ్య బిజినెస్ జరుగుతున్నట్లు చెబుతున్నారు.

Spyder teaser on August 9th

- Advertisement -