శమంతకమణి…ఆడుకుంటోంది

219
Shamantakamani Official Teaser
- Advertisement -

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `శ‌మంత‌క‌మ‌ణి`. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యదార్థ ఘటనల్ని ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.  నలుగురు యువకుల జీవితంలోని అనూహ్య సంఘటనలకు దృశ్యరూపంలా తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇప్పటివరకు నలుగురు హీరోల లుక్‌లను వేరువేరుగా చూపించిన చిత్రయూనిట్.. తాజాగా టీజర్‌తో ఆకట్టుకుంది. టీజర్‌లో నారా రోహిత్ చెప్పిన డైలాగ్‌లతో అంచనాలను మరింతగా పెంచేసింది.  ‘ఈ శమంతకమణేంట్రా నాతో ఆడుకుంటోంది’ అని పోలీస్‌ అధికారిగా నటిస్తున్న నారా రోహిత్‌ టెన్షన్‌ పడుతుంటే మరోపక్క రాజేంద్ర ప్రసాద్‌ ‘శమంతకమణా.. ఆవిడెవరు సర్‌’ అని ఆతృతగా అడగడం దానికి ఆయన చెంప ఛెళ్లుమనడం కామెడీగా ఉంది. ఆ టీజర్ మీకోసం…

- Advertisement -