యు టర్న్ తీసుకున్న సమంత..!

216
Samantha Takes U Turn
- Advertisement -

రంగస్ధలం సక్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత ప్రస్తుతం నాగచైతన్యతో న్యూయార్క్‌లో హాలీడే ట్రిప్‌లో ఉంది. పెళ్లి తర్వాత సినిమాల నుంచి కాస్త రిలీఫ్ దొరకడంతో ఈ ప్రేమజంట తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటోంది. ఎనిమిదేళ్ల క్రితం తెరపై ఏ మాయ చేసావె అంటూ సందడి చేసిన ఈ జోడి.. ఆ సినిమాలో నాగచైతన్య ‘ఐ లవ్‌ యూ జెస్సీ. మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే.. ఇక్కడే..!’ అని సమంత‌కి ప్రపోజ్ చేసిన సెంట్రల్ పార్క్ వద్దకి చేరగానే.. ఉద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.

హాలిడే టూర్ నుంచి రాగానే యూ టర్న్ షూటింగ్‌లో పాల్గొననుంది. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. కన్నడలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యు టర్న్‌..అదే పేరుతో తెలుగు,తమిళ్‌లో వస్తోంది. శ్రీనివాస సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై సినిమా తెరకెక్కనుండగా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ ప్రారంభంకానుంది. మిగిలిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఈ సినిమాతో పాటు సీమరాజా, సూపర్ డిలక్స్ సినిమా షూటింగుల్లో జాయిన్ కానుంది సమంత. నాగ చైతన్య ప్రస్తుతం ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా‌లో నటిస్తున్నారు. పెళ్లయిన తర్వాత సమంత, చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించలేదు. త్వరలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఇద్దరూ కలిసి చేయబోతున్నారు. ఈ చిత్రానికి కంబైన్డ్ రెమ్యూనరేషన్ రూ. 7 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

- Advertisement -