బ్లాక్ బికినీలో రచ్చ చేసిన సమంత…!

429
samantha bikini
- Advertisement -

మజిలి సినిమా సక్సెస్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య-సమంత. ప్రస్తుతం హాలీడే ట్రిపులో భాగంగా స్పెయిన్‌లో విహరిస్తున్న చైసామ్‌ అక్కడి బీచుల్లో రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా భర్త చైతూను పక్కనపెట్టుకుని బికినీలో అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేసింది.

బీచ్‌లో ఇద్దరూ పడక కుర్చీల్లో సేదతీరుతుండగా సమంత బ్లాక్ బికినీలో మెరిసిపోయింది. ఈ ఫోటోపై ‘ఐలవ్యూ 3000’ అని రాసింది. ఇక ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారెంట్ ముందు జంటగా తీసుకున్న ఫొటోను నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటి వరకు రుచి చూసిన అద్భుతమైన వంటకాల్లో ఇదీ ఒకటి అని చైతన్య పేర్కొన్నారు.

samantha

మరోవైపు సమంత బికినీ అందాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో సికిందర్ సినిమాలో బికినీలో సందడి చేసిన సామ్‌ తర్వాత అప్పుడప్పుడు మాత్రమే క్లీవేజ్‌ షోతో అందరి మతి పోగొట్టింది. తాజాగా బ్లాక్ బికినీలో రచ్చరచ్చ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది సమంతకు మద్దతు తెలుపుతుండగా మరికొంతమంది అక్కినేని అభిమానులు ఈ ఫొటోలను చూసి సమంతను తప్పుబట్టారు. గొప్పింటి కోడలివి అయిన తరవాత ఇలాంటివి మానుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -