విన్నర్ ట్రైలర్ ….

346
Sai Dharam Tej Winner Movie Trailer
- Advertisement -

యంగ్‌ హీరో సాయి ధరం తేజ్‌ హీరోగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘విన్నర్’. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా శివరాత్రి కానుకగా రిలీజ్‌ కాబోతుంది. అయితే ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను గత శుక్రవారం రిలీజ్‌ చేద్దాం అనుకున్న చిత్రం యూనిట్‌ కొన్ని టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ కారణాల వల్ల వాయిదా పడింది.

తాజాగా విన్నర్‌ సినిమా టీజర్‌ ఈరోజు రిలీజైంది. ట్రైలర్ లోనే ఆసక్తిని కనబర్చాడు దర్శకుడు గోపిచంద్‌. యాక్షన్, డైలాగ్, కామెడీ.. అన్నింటితో ట్రైలర్ ని నింపేశాడు. అంతేకాదు.. విన్నర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ లని కూడా చూపించేశాడు. పవన్ మాదిరిగా తేజు చేతిలో ఎర్రని శాలువ కనిపించింది. ఇక, ‘బుజ్జిగాడు’లో ప్రభాస్ హీరోయిన్ త్రిషని అడినట్టు.. ఏదైనా మాట్లాడండి డైలాగ్ ని పెట్టేశాడు.

పులి ఊరి మీద పడ్డప్పుడు అందరు పరిగెడతారు ..కాని ఒక్కడు మాత్రం ఎదురొస్తాడు అంటూ మొదలైన ఈ ట్రైలర్ చివరి వరకు చాలా ఆసక్తికరంగా ఉంది. పాటలు, ఫైటింగ్ సన్నివేశాలు, గుర్రపు స్వారీలు ఇలా అన్ని అంశాలతో ట్రైలర్ ని దర్శకుడు మలినేని చాలా అందంగా తీర్చిదిద్దాడు. మొత్తానికి.. ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఈ చిత్రంలో సాయిధర్మతేజ్‌ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన విషయం తెలిసిందే. ఈసినిమాలో మరోసారి జగపతి బాబు విలన్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీలో కామెడీయన్స్‌గా 30 ఇయర్స్ఇండస్ట్రీ పృద్వీ, ఆలీ, వెన్నలకిషోర్‌లు కామెడీ పండిచనున్నారు.

ఈ మూవీ ట్రైలర్‌ చూసిన కొంత మంది నెటిజన్లు రొటీన్ మసాలాయే కాని.. కామెడీ క్లిక్ అయితే.. యాక్షన్ సక్సెస్ అయితే.. సినిమా హిట్టయ్యే ఛాన్సుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫిబ్రవరి19న విన్నర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

- Advertisement -