“సీత” ఐటెం సాంగ్ లో RX 100 బ్యూటీ

482
payal rajput sita movie
- Advertisement -

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న సినిమా సీత‌. ఈచిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈసినిమాలో క‌థానాయిక‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉన్న‌ట్లు స‌మాచారం. సీత పాత్ర‌లో కాజ‌ల్, రామ్ పాత్ర‌లో సాయి శ్రీనివాస్ న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈమూవీ చాలా వ‌ర‌కూ చిత్ర‌క‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఎప్రిల్ లో సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

Bellamkonda-Sreenivas-Kajal-Aggarwal-and-Teja-s-SITA-Movie

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఉన్న‌స‌మాచారం ప్ర‌కారం ఈచిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ట‌. ఆ పాట‌లో ఆర్ ఎక్స్ 100హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ ను సంప్ర‌దించార‌ట చిత్ర‌బృందం. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని తెలుస్తుంది.

bellamkonda kajal

త్వ‌ర‌లోనే పాయ‌ల్ రాజ్ పుత్ షూటింగ్ లో పాల్గోన‌నుంద‌ని స‌మాచారం. ఆర్ ఎక్స్ 100చిత్రంలో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను దగ్గరైంది పాయల్. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. తాజాగా ర‌వితేజ డిస్కోరాజా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

- Advertisement -