కొమురవెల్లి మల్లన్న ఆలయంలో దొంగలు పడ్డారు..!

388
komuravelli
- Advertisement -

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో దొంగలు పడ్డారు. మల్లన్న బ్రహ్మోత్సవాల హుండి లెక్కింపులో భాగంగా బంగారం నాణ్యత పరిశీలించే స్వర్ణకారులు చేతివాటం ప్రదర్శించారు.

ఆలయంలోని నగదు కానుకలను ఉద్యోగులతో పాటు సేవా సమితి సభ్యులు లెక్కిస్తుంటారు. బంగారు కానుకల విషయానికి వచ్చేసరికి వాటి నాణ్యతను పరిశీలించడానికి స్థానికులైన స్వర్ణకారులకు పని అప్పగిస్తారు. అదే అదనుగా చేసుకొని బూర్గుల శ్రీనివాసచారి, బూర్గుల కిషన్‌ చారి 20గ్రాముల బంగారు నెక్లెస్‌ను మాయం చేశారు.

అలాగే మరో 10 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించారు.అయితే వారు వెళ్లే సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తనిఖీచేయగా అసలు విషయం బయటపడింది. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -