పసుపుబోర్డు పోరాటానికి మద్దతిస్తా..

229
Ramdev with Kavitha and Harish
- Advertisement -

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలన్న ఎంపీ కవిత చేస్తున్న పోరాటానికి మద్దతిస్తానని స్పష్టం చేశారు యోగా గురు బాబా రాందేవ్. రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన యోగా శిబిరాన్ని ప్రారంభించిన ఆయన రైతులు చేసే పోరాటానికి ఎప్పుడు మద్దతు ఉంటుందన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ కవిత తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో పతంజలిదే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు. దేశంలో 15 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ పతంజలి గ్రూప్ ద్వారా జరుగుతుందన్నారు. పతంజలి సంస్థలో లక్ష మంది పనిచేస్తున్నారు. పతంజలి టర్నోవర్‌ రూ.12 వేల కోట్లు అని తెలిపారు. డెయిరీ బిజినెస్‌ లోనూ పతంజలి అడుగుపెట్టబోతుందని బాబా రాందేవ్‌ చెప్పారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి బాబా రాందేవ్ లేఖ రాశారని గుర్తు చేశారు ఎంపీ కవిత. రైతుల ఆందోళనకు మీ మద్దతు ఇలాగే కొనసాగించాలని రాందేవ్ బాబాను కోరారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే విధంగా ప్రధానితో మాట్లాడాలని రాందేవ్ బాబాకు విజ్ఞప్తి చేశారు. పతంజలి కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పాలని కోరారు. పతంజలి కంపెనీ చేపట్టబోయే ప్రతి పనికి తెలంగాణ ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు.

- Advertisement -