కేసీఆర్ బయోపిక్ నుండి వర్మ వదిలి సాంగ్.. వీడియో వైరల్‌

379
Ram Gopal Varma
- Advertisement -

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటివలే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం వర్మ మరో బ‌యోపిక్‌ రూపొందించే ప‌నిలో ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో బ‌యోపిక్ రూపొందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

Tiger KCR

తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్మ మరో కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్ రావు, వైఎస్సార్, జగన్, చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్ ఉంటారని తెలిపారు. వీరితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎంలు రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఉంటారని తెలిపారు.

ఇక కొద్దిసేపటి క్రితమే ‘టైగర్ కేసీఆర్’ లోని ఓ సాంగ్ లిరిక్స్ ను వర్మ స్వయంగా పాడుతూ వీడియో తీసి తన ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ పాట లిరిక్స్ ఇప్పుడు తీవ్ర వివాదం రేపేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -