రివ్యూ : రాజా ది గ్రేట్

281
Raja the Great review
- Advertisement -

మాస్ మహారాజాగా ప్రేక్షకుల్లో రవితేజకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు కూడా మాస్‌కు తగ్గట్టుగానే ఉంటాయి. ‘కిక్ 2’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల తర్వాత చాలా విరామం తీసుకుని ఇప్పుడు సరికొత్తగా ‘రాజా ది గ్రేట్’ అంటూ వచ్చాడు ప్రేక్షకుల ముందుకువచ్చాడు.   ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తుండగా  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు.కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రవితేజకు హిట్ ఇచ్చిందా లేదా చూద్దాం…

కథ :

హీరో(రవితేజ) పుట్టుకతోనే అంధుడు. తన కుమారుడిని పోలీస్‌గా చూడాలని అతని తల్లి(రాధిక) కలలు కంటుంది. అయితే అంధుడు కావడంతో పోలీసు ఉద్యోగానికి అనర్హుడు అవుతాడు. ఈ క్రమంలో హీరోయిన్(మెహ్రీన్)కు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను హీరో తన భుజాన వేసుకొంటాడు. అయితే దానికి ఓ పోలీస్ ఆపరేషన్ అవసరం అవుతుంది. ఆ ఆపరేషన్‌ను అంధుడైన హీరో ఎలా టేకప్ చేశాడు. పోలీసులకు సాధ్యం కాని పనిని ఎలా పూర్తి చేశాడు అనేది ‘రాజా ది గ్రేట్’ కథ.

 Raja the Great review
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌ రవితేజ నటన, కామెడీ, సినిమాటోగ్రఫీ. రవితేజ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా అంధుడిగా అద్భుతంగా నటించాడు. ర‌వితేజ ,పృథ్వి , రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ మెహ్రిన్‌ తన అందచందాలతో సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. హీరోయిన్‌ను ఇబ్బందుల నుంచి సేవ్ చేసేందుకు ర‌వితేజ చేసే ప్ర‌య‌త్నాలు బాగున్నాయి. ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ బ్యాంగ్ హైలెట్. మిగితా నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

మైన‌స్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్, ర‌న్ టైం,రొటీన్ రివేంజ్ డ్రామా. ఫస్టాఫ్  బాగున్న సెంకండాఫ్‌ స్లో అవ్వకుండా చూసుకుని మరింత బాగుండేదనిపిస్తుంది.

 Raja the Great review

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. సాయికార్తీక్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌,కామెడీ ఎపిసోడ్స్‌తో అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నం ఫలించింది.  సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్. ఎడిటింగ్ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

 Raja the Great review
తీర్పు:

బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ సినిమా కోసం  అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత దిల్ రాజు కాంబినేషన్‌తో రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజ యాక్టింగ్, కామెడీ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ స్టోరీ, రన్ టైం సినిమాకు మైనస్ పాయింట్స్. మొత్తంగా దీపావళి సెలవుల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

విడుదల తేదీ:18/10/2017
రేటింగ్:2.75/5
నటీనటులు: రవితేజ, మెహ్రీన్
సంగీతం:సాయి కార్తీక్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం :అనిల్ రావిపూడి

- Advertisement -