‘మన్మథుధుడు 2’.. అదిరిపోయే లుక్‌లో నాగ్‌

282
Nagarjuna
- Advertisement -

కింగ్ నాగార్జున‌ ఆరు ప‌దుల‌కి చేరువైన ఇప్ప‌టికి టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా, గ్రీకు వీరుడిగా అమ్మాయిల మ‌న‌సులు దోచుకుంటున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్‌.. నాగ్‌కు సంబంధించిన లుక్స్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.

‘దిస్‌ మ్యాన్‌.. ఫిట్‌నెస్‌ గోల్స్‌. కింగ్‌ ఫ్యాన్స్‌.. ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఫొటోలో నాగ్‌ కసరత్తులు చేస్తూ కనిపించారు. ఈ లుక్‌లో ఆయన మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తు్న్నారు. సమంత అతిథి పాత్రలో కనిపిస్తారు.

- Advertisement -