స్థానిక సమరం…నోటిఫికేషన్ రిలీజ్

223
panchayat-elections
- Advertisement -

స్ధానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తొలివిడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 197 జడ్పీటీసీ,2166 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 32 జిల్లాల్లో ఎన్నికలు జరగనుండగా నేటి నుండే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 24 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా 25న పరిశీలన, 26న అప్పీలుకు గడువు ఉంటుంది. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలివిడత ఎన్నికల పోలింగ్ మే6న జరగనుంది.

పార్టీల తరుఫున బీ-ఫాంలు సమర్పించినవారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు. ఆ తర్వాతి క్రమంలో స్వతంత్రులకు గుర్తులు ఇస్తారు.నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీల్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులైతే కలెక్టర్‌కు, ఎంపీటీసీ అభ్యర్థులైతే ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు.. మే 27న ఫలితాలను ప్రకటించనున్నారు.

- Advertisement -