రాజకీయాల్లోకి రాను:మహేష్

241
No politics says, Mahesh Babu
- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ భరత్ అనే నేను. ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుండగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్‌లో భారీ స్ధాయిలో విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన మహేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని భవిష్యత్‌లోనూ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజకీయాలు తనకు ఏ మాత్రం సరిపడేవి కావని ..మరో రకంగా ప్రజాసేవ చేస్తాను కానీ, రాజకీయాల్లోకి రాను.. స్ఫష్టం చేశారు. తమ సినిమా రాజకీయ సంబంధ కాన్సెప్ట్‌తోనే రూపొందినా, ప్రస్తుతం ఉన్న పార్టీల్లో దేన్నీ సపోర్ట్ చేయడం కానీ, విమర్శించడం కానీ సినిమాలో ఉండదని తెలిపారు.

No politics says, Mahesh Babu

అయితే మహేష్ రాజకీయాల్లోకి రాకపోయిన మహేశ్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ‌ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచారు. మహేశ్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. మహేశ్ బాబాయ్ ఆదిశేషగిరి రావు ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. అంతేగాదు మహేష్ అన్నయ్య నరేష్ కొంతకాలం బీజేపీలో కొనసాగారు. ఈ నేపథ్యంలో మహేష్ కూడా రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన మహేష్ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని తేల్చి చెప్పేశాడు.

- Advertisement -