ఉద్యోగాల కల్పనలో విఫలమైన మోడీ…

251
- Advertisement -

దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మండిపడ్డారు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజా గర్జన బహిరంగసభలో మాట్లాడిన రాహుల్ రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదన్నారు. తెలంగాణ ప్రజల గుండెలోతుల్లో బాధ ఉంది కాబట్టే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని…. నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం పోరుబాటపట్టారని వెల్లడించారు.

ఇదే వేదికపై నుంచి గతంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాట్లాడారని, ఇది ప్రశ్నించే నేల అని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో రూ. 70 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేశామని గుర్తుచేశారు.

No employment says Rahul- Modi failed
సోనియా గాంధీ తెలంగాణ ప్ర‌జ‌ల‌ బాధ‌ను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చారని, అది ఒక చారిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యమ‌ని, ఎంతో మంది వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. మేకిన్ ఇండియా అంటూ, పారిశ్రామిక విప్ల‌వం తెస్తానంటూ మోడీ ఎన్నో మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చార‌ని, మూడేళ్లు అవుతున్నా ఏమీ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు.

గుజ‌రాత్‌లో రైతుల భూములు అధికంగా లాక్కున్నార‌ని…. అతి పెద్ద నిరుద్యోగ స‌మ‌స్య మోడీ హ‌యాంలో చూస్తున్నామ‌ని మండిప‌డ్డారు.  రైతుల మేలు కోసం తెచ్చిన భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. కార్పొరేట్ల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని…. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదని తెలిపారు.

- Advertisement -