ఎక్కడ చూసిన ‘క్యాష్’ కష్టాలే..

282
No cash with ATMs
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో ఏ నగరంలో చూసినా అత్యధిక ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులు కనిపిస్తున్నాయి. డబ్బులున్న ఒకటి రెండు ఏటీఎంల ముందు క్యూలైన్లు పెరిగిపోతుండగా, 2016 నవంబర్ లో నోట్ల రద్దు తరువాతి పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ, బ్యాంకులకు వెళుతుంటే, అక్కడ సైతం అడిగినంత డబ్బు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. క్యాష్ కష్టాలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా, ఇటీవలి కాలంలో వరుస సెలవులు రావడంతోనే ఈ ఇబ్బంది కలిగిందని బ్యాంకుల ఉన్నతాధికారులు చెబుతున్నారు.

No cash with ATMs

ఇప్పుడు మరోసారి పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. అప్పటి కంటే పరిస్థితి ఇప్పడు దారుణంగా ఉంది. కొన్ని చోట్ల ఏటీఎంలలో కేవలం రెండు వేల రూపాయాల నోట్లు ఉండటంతో చిల్లర సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. అంతేకాదు మరోవైపు రూ. 2 వేల నోట్లు తిరిగి డిపాజిట్ కావడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

రద్దయిన నోట్ల స్థానంలో 80 శాతం కరెన్సీని కొత్త నోట్ల రూపంలో విడుదల చేసినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో సర్క్యులేట్ కావడం లేదని వెల్లడించారు. తాము పక్క రాష్ట్రాల నుంచి కూడా డబ్బును తెప్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నామని, అతి త్వరలోనే ఏటీఎంలలో క్యాష్ నింపే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

No cash with ATMs

కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య ఉన్నమాట వాస్తవమేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా ఈ సందర్బంగా పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల కరెన్సీ ఉందన్నారు. పలు రాష్ర్టాల్లో నగదు తక్కువగా ఉందన్నారు. దీంతో ప్రభుత్వం నగదు కొరతను తీర్చేందుకు రాష్ర్టాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. నగదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి నగదు లేని రాష్ర్టాలకు డబ్బు తరలించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. నగదు కొరత సమస్య మూడు రోజుల్లో తీర్చుతామని శుక్లా స్పష్టం చేశారు.

- Advertisement -