నా గెలుపు అల్రెడీ మొదలైంది…

238
Ninnu Kori Theatrical Trailer
- Advertisement -

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న హీరో నాచురల్ స్టార్ నాని. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌ వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నాని తాజాగా ‘నిన్నుకోరి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి.

ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్, మ్యూజిక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. నివేదా థామస్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. గోపి సుందర్ సంగీతం అందించిన ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఓ ల‌వ్ స్టోరీ.. వినోదం.. బ్రేక‌ప్‌… విర‌హం… క‌థ ఇలా సాగ‌బోతోంద‌ని ట్రైల‌ర్‌లో తెలిసిపోతోంది.

తననే ప్రేమించా.. తననే పెళ్లిచేసుకోవాలనుకున్నా.. చావైనా బ్రతుకైనా తనతోనే అనుకున్నా అంటూ నాని చెప్పిన డైలాగ్‌తో పాటు నీకు అర్థం అవుతోందా… నా గెలుపు ఆల్రెడీ మొద‌లైపోయింది` అనే డైలాగ్ తో  ముగించిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.  జూలై 7న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -