నాని… ఎంసీఏ ఫస్ట్ లుక్

310
Nani MCA first look
- Advertisement -

సెలక్టెడ్ అండ్ సింపుల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే హీరోల్లో నాని ఒకరు. నిన్నుకోరి తర్వాత  మిడిల్ క్లాస్ అబ్బాయిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న  ఎంసీఏ మూవీ సూపర్ ఫాస్ట్‌గా తెరకెక్కుతోంది. దీపావళి సందర్భంగా ఎంసీఏ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఫిదా ఫేమ్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి  వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని లుంగీ కట్టుకుని, పాల ప్యాకెట్లతో నడుచుకుంటూ రావడం ఫన్నీగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీని తర్వాత నాని.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ కథానాయికలు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

- Advertisement -