శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఎంపి కవిత

370
- Advertisement -

తెలంగాణ,ఏపీ అభివృద్ధి పథంలో పయనించాలని ఎంపీ కవిత ఆకాంక్షించారు. సోమవారి కుటుంబసమేతంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న కవిత ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు. మల్లిఖార్జునుడు,భ్రమరాంబిక అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కవితకు వేద పండితులు ఆశిర్వచనాలు అందజేశారు. అనంతరం హఠకేశ్వర ఆలయంలో పూజలు చేశారు.

మహాలింగ దర్శనం కోసం పార్టీ,జాగృతి కార్యకర్తలు కుటుంబంలా కలిసి వచ్చామని, ఇలా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కవిత. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆలయాల్లో పూజలు చేశామని, ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణ ను అభివృద్ధి పథంలో పయనిస్తూ, నెంబర్ 1 స్టేట్ గా మారాలని కోరుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ అన్నదమ్ములు గా కలిసి ఉంటూ, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొందరు భక్తులు, స్థానికులు శ్రీశైలం కు బస్, రైల్ సౌకర్యం సరిగా లేదని, హైదరాబాద్ నుంచి శ్రీశైలం కు, శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు బస్ లు తక్కువగా నడుస్తున్నాయి అని తన దృష్టికి తీసుకు వచ్చారు అని ఎంపీ కవిత తెలిపారు. రెండు ప్రభుత్వాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తానని అన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.గత సెషన్ లో పార్లమెంట్ హౌస్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీని గుర్తుచేస్తామన్నారు. పెండింగ్ హామీలపై టిఆర్ఎస్ ఎంపిలమంతా గళమెత్తుతామని ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

- Advertisement -