బెంగళూరు సౌత్‌ నుండి బరిలో మోడీ..!

263
modi varanasi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేసే రెండో ఎంపీ స్ధానం దాదాపుగా ఖరారైంది. యూపీలోని వారణాసి నుండి మోడీ నుండి పోటీచేస్తున్నారని ఇప్పటికే బీజేపీ వర్గాలు ప్రకటించగా ఆయన పోటీచేసే రెండో స్ధానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొంతకాలంగా సౌత్‌పై ప్రత్యేక దృష్టిసారించిన మోడీ బెంగళూరు నుండి బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాదిలో పట్టుసాధించాలని కొంతకాలంగా కమలం నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు సౌత్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా బరిలోకి దిగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 సీట్లు ఉండగా, అందులో 21 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో బెంగళూరు సౌత్ లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

బెంగళూరు సౌత్ నుంచి అనంతకుమార్ వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. అనంతకుమార్ మరణానంతరం ఆయన భార్య తేజస్వినిని బరిలోకి దించాలని బీజేపీ అధిష్ఠానం భావించింది. అయితే, ప్రధాని మోదీ దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించడంతో తేజస్వినిని పక్కనపెట్టారు.

మోదీ వారణాసితోపాటు బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీ నగర్ నుంచి బరిలోకి దిగాలని భావించారు. అయితే, గాంధీనగర్ నుంచి అమిత్ షా బరిలోకి దిగుతుండడంతో మోడీ బెంగళూరుకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ మోడీ దక్షినాది నుండి బరిలో ఉంటే రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

- Advertisement -