మెహబూబా ఫస్ట్‌ లుక్…టీజర్

297
MEHBOOBA First Look Teaser
- Advertisement -

హిట్టొచ్చినా, ఫ్లాపులిచ్చినా దర్శకుడు పూరి బిజీనే. బాలయ్యతో పైసా వ‌సూల్‌తో పర్వాలేదనించిన పూరి..ప్రస్తుతం తనయుడు ఆకాష్‌తో మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్నారు. 1971 నాటి ఇండియా పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా హైదరాబాద్ షెడ్యూల్‌ని పూర్తిచేసుఏకుంది.

మంగళూరు అమ్మాయి నేహా శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ ఉంటుంద‌ని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. టీజ‌ర్‌లో పూరి మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. పంజాబ్‌, హ‌ర్యానా, రాజ‌స్థాన్ రాష్ట్రాల‌ల‌లో చిత్రానికి సంబంధించి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -