శంకర్ తో మెగాస్టార్..నిర్మాతగా అల్లు అరవింద్

347
Chiru Shankar
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహరెడ్డి మూవీలో నటిస్తున్నారు. ఈచిత్రానికి ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతారా హీరోయిన్ నటిస్తున్న ఈసినిమాను..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈసినిమా తర్వాత చిరు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పనిచేయనున్నాడు. కొరటాల శివ ప్రస్తుతం కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

Chiranjeevi Shankar

ఇక ఈసినిమా తో పాటు మెగా స్టార్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమిళ్ టాప్ దర్శకుడు శంకర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఎలాగైనా తన బ్యానర్ గీతా ఆర్ట్స్ లో చిరంజీవితో ఒక సినిమా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శంకర్ తో తీయబోయే సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నారని తెలుస్తుంది.

వీరిద్దరి కాంబినేషన్ ను సెట్ చేసింది కూడా అల్లు అరవింద్ అని ఫిల్మ్ వర్గాల సమచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారట. శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా విడుదల కావడానికి ఇంకా సంవత్సరం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత చిరుతో సినిమా తీయనున్నాడని తెలుస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తే బ్లాక్ బాస్టర్ హిట్ కావడం ఖాయమంటున్నారు చిరు అభిమానులు.

- Advertisement -