జనసేన ఎంపీ అభ్యర్ధిగా మెగా బ్రదర్..

231
nagababu mp janasena
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఎపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. నేడో రేపో అభ్యర్ధులను కూడా ఖరారు చేయనున్నారు ప్రధాన పార్టీల నేతలు. ఇప్పటికే ప్రచార రూపకల్పనను సిద్దం చేసుకున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి ఎపీలో 175 అసెంబ్లీ స్ధానల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. కమ్యూనిష్టు పార్టీలతో తప్ప తాము ఎవరితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ తో 34మంది ఎమ్మెల్యే , ఇద్దరు ఎంపీ అభ్యర్ధుల పేర్లును విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనసేను మొత్తం 2200 దరఖాస్తులుగా రాగా వాటిని పరిశీలిస్తుంది స్క్రీనింగ్ కమిటీ.

ఇక తాజాగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన తరపున ఎంపీగా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ జనసేనకు దూరంగా ఉంటూ వస్తుంది. కుటుంబం నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా పవన్ పార్టీని స్ధాపించారు. ఇప్పుడు నాగబాబు పేరు తెరపైకి రావడం చర్చాంశనీయంగా మారింది. ఇటివలే నాగబాబు జనసేన పార్టీ కార్యకర్తలతో వరుసగా భేటి అవుతున్నారు. అంతేకాకుండా యూ ట్యూబ్ ఛానల్ లో జగన్, చంద్రబాబు లపై కూడా తీవ్ర స్ధాయిలో విమర్శలు చేస్తున్నాడు.

ఇటివలే ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించిన జనసేన ..త్వరలోనే సెకండ్ లిస్ట్ ను కూడా ప్రకటించనుందని తెలుస్తుంది. సెకండ్ లిస్ట్ లో నాగబాబు అభ్యర్థిత్వంపైనా అధికార ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగేలా నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబును దింపాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు నాగబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈసారి ఎలాగైనా ఎపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాన్‌.

- Advertisement -